న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు మాజీ కెప్టెన్ పీఆర్ శ్రీజేశ్‌ను హాకీ ఇండియా (హెచ్‌ఐ) నామినేట్ చేసింది. రెండేసి ప్రపంచకప్‌లు, ఒలింపిక్స్‌లో పాల్గొనడంతోపాటు అనేక టోర్నీల్లో ఇండియా విజయాలు సాధించడంలో శ్రీజేశ్ కీలకపాత్ర పోషించాడు. మిడ్‌ఫీల్డర్ చింగ్లెన్‌సనా సింగ్ , ఫార్వర్డ్ ఆకాశ్‌దీప్ సింగ్, మహిళా టీమ్ డిఫెండర్ దీపిక పేర్లను అర్జున అవార్డుకు హెచ్‌ఐ ప్రతిపాదించింది. ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కోసం ఆర్పీ సింగ్, సందీప్ కౌర్‌లను, ద్రోణాచార్య అవార్డుల కోసం కోచ్‌లు బల్జీత్ సింగ్, బీఎస్ చౌహాన్, రమేశ్ పథానియాలను నామినేట్ చేసింది.

