సంస్థ అభివృద్ధిపై ఫోకస్ పెట్టండి..  :సీఎండీ ప్రభాకర్‌‌రావు

సంస్థ అభివృద్ధిపై ఫోకస్ పెట్టండి..  :సీఎండీ ప్రభాకర్‌‌రావు

హైదరాబాద్‌‌, వెలుగు: విద్యుత్‌‌ కార్మికులు సంస్థల అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో సీఎండీ ప్రభాకర్‌‌రావు కోరారు.  సంస్థను అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేయాలన్నారు. బుధవారం ఆయన మింట్‌‌కాంపౌండ్‌‌ ఆవరణలో జరిగిన ఓ కార్యక్రమంలో 'ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌‌ పే రివిజన్‌‌' పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. విద్యుత్‌‌ సంస్థల అభివృద్ధిలో కార్మికులు భాగస్వామ్యం కావాలని సూచించారు.

యూనియన్‌‌ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు.  ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి సాయిబాబా మాట్లాడుతూ.. విద్యుత్‌‌ ఉద్యోగులకు జీపీఎఫ్‌‌ను  అమలు చేయాలని కోరారు. ఏడాది క్రితం చేరిన ఉద్యోగులకు వేతన వ్యత్యాసం సవరించాలని, సొసైటీ ద్వారా పేమెంట్‌‌ తీసుకునే 136 మందికి ఆర్టీజన్‌‌లుగా గుర్తించాలన్నారు. అన్ని క్యాడర్‌‌ ఉద్యోగులకు పెండింగ్‌‌లో ఉన్న ప్రమోషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సదరన్‌‌ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి, పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.