
సినిమాలోని తమ పాత్ర కోసం హీరోలు స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు. లుక్‌తో పాటు గెటప్, ఫిట్‌నెస్ విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా ప్రభాస్ సైతం తన నెక్స్ట్ ప్రాజెక్టు కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’తో పాటు హను రాఘవపూడి రూపొందిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్.. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీ సెట్‌లో అడుగుపెట్టనున్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కంప్లీట్ కొత్త లుక్, ఫిజిక్‌తో కనిపించనున్నాడు.
దీనికోసం మరింత ఫిట్‌గా రెడీ అవుతున్నాడు ప్రభాస్. గంటలకొద్దీ జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. దీంతో మునుపటి కంటే ఇప్పుడు మరింత స్లిమ్‌గా కనిపిస్తున్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ పోషించనున్నాడని తెలుస్తోంది. హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రి నటించనుంది. టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.