ఇన్ స్టాలో 'బాహుబలి' అకౌంట్ మిస్సింగ్.. హ్యాకింగా.. డీయాక్టివేట్ చేశారా..?

ఇన్ స్టాలో 'బాహుబలి' అకౌంట్ మిస్సింగ్.. హ్యాకింగా.. డీయాక్టివేట్ చేశారా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్లాట్‌ఫారమ్ నుంచి సడెన్ గా అదృశ్యమైంది. దీనిపై కొందరు అకౌంట్ హ్యాక్ అయి ఉండొచ్చని, మరికొందరు ప్రభాస్ స్వయంగా డీయాక్టివేట్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రభాస్ సాధారణంగా సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటారు. కేవలం ఫేస్ బుక్, ఇన్ స్టా మాత్రమే అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటారు. ఈ రెండు ఖాతాల్లో కేవలం తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే పంచుకుంటారు. ప్రభాస్ కు ఇన్ స్టాలో దాదాపు కోటి అంటే పది మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఉన్నట్లుండి ప్రభాస్ ఇన్ స్టా అకౌంట్ మిస్ అయ్యింది.

ఇన్‌స్టాగ్రామ్ ను ఓపెన్ చేసి ప్రభాస్ అని సెర్చ్ చేస్తే ప్రభాస్ అకౌంట్ ఏదీ కనిపించడం లేదు. ఫ్యాన్ మేడ్ అకౌంట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఒరిజినల్ & అఫీషియల్ అకౌంట్ మిస్ అయ్యింది. ప్రస్తుతం హ్యాక్ అయిన అకౌంటును వెనక్కి తీసుకు వచ్చే ప్రయత్నాల్లో ప్రభాస్ టీమ్ ఉందని తెలుస్తోంది.

ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఆయన లేటెస్ట్ మూవీ సాలార్ పార్ట్ 1 డిసెంబర్ 22, 2023న గ్రాండ్ గా రిలీజ్‌ కాబోతుంది. మేకర్స్ వచ్చే నెల నుంచి ఈ మూవీ ప్రమోషన్‌లను ప్రారంభించబోతున్నారు. ఇక మారుతీ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్‌లో కూడా ప్రభాస్ చురుగ్గా పాల్గొంటున్నాడు. దాంతో పాటు నాగ్ అశ్విన్ తో ‘కల్కి’లోనూ ప్రభాస్ నటిస్తున్నాడు.