
ఓవైపు ‘కల్కి 2898 ఎడి’ అనే సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. మరోవైపు ‘రాజా సింగ్’ అనే హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ సరికొత్త అవతార్‌లో కనిపిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో లాంగ్ హెయిర్, ఫ్రెంచ్ బియర్డ్‌తో మునుపెన్నడూ కనిపించనంత న్యూ లుక్‌లో సర్‌ప్రైజ్ చేస్తున్నాడు ప్రభాస్.
ఈ లుక్ ఎందుకోసమనేది తెలియాల్సి ఉంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఎడి’ కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపిక, దిశా పటానీ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది.