శ్రీసింహ హీరోగా రితేష్ రానా రూపొందించిన చిత్రం ‘మత్తు వదలరా2’. ఫరియా అబ్దుల్లా, సత్య ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. ఆదివారం ఈ మూవీ ట్రైలర్‌ను హీరో ప్రభాస్ రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా సాగిన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.
హెచ్‌ఈ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్లుగా పనిచేస్తుంటారు శ్రీసింహ, సత్య. వాళ్లు పట్టుకున్న కిడ్నాపర్‌ల నుండి డబ్బును గుంజుతుంటారు. అనుకోకుండా జరిగిన ఓ మర్డర్‌తో వారి జీవితం మలుపు తిరుగుతుంది. స్పెషల్ ఏజెంట్ చీఫ్‌గా సునీల్, ఫరియా అబ్దుల్లా ఇంప్రెస్ చేశారు. అజయ్, రోహిణి, ఝాన్సీ ముఖ్య పాత్రలు పోషించారు. కాల భైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంది. సెప్టెంబర్ 13న సినిమా విడుదల కానుంది.