సలార్ వేట మొదలు.. క్రాష్ అవుతున్న ఒక్కో రికార్డ్

సలార్ వేట మొదలు.. క్రాష్ అవుతున్న ఒక్కో రికార్డ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) రికార్డుల వేట మొదలు పెట్టేశాడు. సలార్(Salaar) దెబ్బకు యూట్యూబ్ రికార్డ్స్ అన్నీ ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయి. జులై 6 ఉదయం 5:12 నిమిషాలకు రిలీజైన ఈ టీజర్ కు దేశవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో.. ఈ టీజర్ రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకుంటోంది. పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. టీజర్ రిలీజైన కేవలం 7 గంటల్లోనే 17 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. నిమిషనిమిషానికి ఈ కౌంట్ పెరుగుతూనే ఉంది. త్వరలోనే 20 మిలియన్ మార్క్ ను దాటనుంది.
 
ఇక గత కొంత కాలంగా ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనిపించడంతో పిచ్చెక్కిపోతున్నారు రెబల్ స్టార్ అభిమానులు. టీజర్ కూడా ఉదయం ఐదుగంటలకే రావడంతో.. అలారాలు పెట్టుకొని మరీ లేచి ఈ టీజర్ ను చూశారు. ఈ ఒక్క ఎగ్జామ్పుల్ చాలు సలార్ సినిమా  కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో చెప్పడానికి.

ఇక పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సలార్ మూవీ టీజర్ ను సింగిల్ డైలాగ్ తో ఫినీష్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel). అది కూడా ఇంగ్లీష్ లో. ఈ కారణంగానే సలార్ టీజర్ కు ఇండియా వైడ్ గా భారీ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, హిందీ, తమిళ,కన్నడ మళయాళ.. ఇలా భాషతో సంబంధం లేకుండా.. యూనివర్స ల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ను వాడేసి అందరికీ కనెక్ట్ చేశారు ప్రశాంత్. కేవలం ఈ ఒక్క డైలాగ్ సినిమాపై ఓ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మరి టీజర్ తోనే ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సలార్ మూవీ.. రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ 28 వరకు ఆగాల్సిందే.