సలార్ టీజర్ కిరాక్ కానీ.. ఆ ఒక్క డైలాగ్ కూడా ఉంటే బాగుండేది!

సలార్ టీజర్ కిరాక్ కానీ.. ఆ ఒక్క డైలాగ్ కూడా ఉంటే బాగుండేది!

ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్న సలార్(Salaar) టీజర్ వచ్చేసింది. తమ అభిమాన హీరోను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో పక్కా.. అలాగే డిజైన్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel). సాలార్ ఎలివేషన్ తో స్టార్ ఐన ఈ టీజర్ మొత్తాన్ని.. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాకుడ్ గా, మాస్ ఆడియన్స్ ను మెప్పించేలా కట్ చేశారు. 

ఈ టీజర్ చూసిన చాలా మంది నెటిజన్స్ టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉంది.. ఇది కదా ఆ కటౌట్ కు పడాల్సిన బొమ్మ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే మరికొంత మంది సలార్ టీజర్ పై పెదవి విరుస్తున్నారు. అంతేకాదు..టీజర్ చివర్లో ఆ ఒక్క డైలాగ్ కూడా ఉండి ఉంటే ఎక్కడికో వెళ్లిపోయేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే.. సలార్ టీజర్ స్టార్టింగ్ లో.. "లయన్, చీతా, టైగర్, ఎలిఫాంట్ వెరీ డేంజరస్. అయితే... జురాసిక్ పార్క్ లో కాదు. ఎందుకంటే... ఆ పార్క్ లో".. అనగానే పిడికిలి బిగించిన ప్రభాస్ ఇంట్రో వస్తుంది. అంటే జురాసిక్ పార్కులో డైనోసార్ అనే మీనింగ్ లో.. సలార్ ను డైనోసార్ తో పోల్చుతూ వీర లెవల్ ఇంట్రో ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్. అయితే ఇక్కడే కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజపాయింట్ అయ్యామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంట్రో డైలాగ్ చివర్లో.. ఎందుకంటే... ఆ పార్క్ లో అని వదిలేయకుండా.. డైనోసార్ అని కానీ సలార్ ఉంటాడు అని కానీ చెప్పుంటే.. టీజర్ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవల్లో ఉండేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దానికి చాలామంది మద్దతు కూడా తెలుపుతున్నారు.

ఇక ఈ టీజర్ తో సలార్ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు  రానున్న ఈ సినిమా కూడా కెజిఎఫ్ ను మించి సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది. మరి ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ రానుందో తెలియాలంటే సెప్టెంబర్ 28 వరకు ఆగాల్సిందే.