బుకారెస్ట్ (రొమేనియా): ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. సూపర్ క్లాసిక్ చెస్ టోర్నీలో నాలుగో రౌండ్ గేమ్‌నూ డ్రాగానే ముగించాడు. జోర్డెన్ వాన్ ఫోరెస్ట్ (నెదర్లాండ్స్)తో సోమవారం జరిగిన ఈ గేమ్ 35 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞా స్టార్టింగ్‌లో కొద్దిగా ప్రతిఘటన ఎదుర్కొన్నాడు.
అయితే కీలక టైమ్‌లో వ్యూహాత్మకంగా అడుగులు వేసి గేమ్‌ను మలుపు తిప్పాడు. ఎండ్ గేమ్‌లో ఇద్దరు ప్లేయర్లు ఒకే రకమైన ఎత్తులను పునరావృతం చేయడంతో గేమ్ డ్రా వైపు వెళ్లింది. ఇప్పటి వరకు ప్రజ్ఞ ఒక విజయం, మూడు డ్రాలతో కలిపి మొత్తం రెండున్నర పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
