సికింద్రాబాద్​ను స్వర్గంలా మారుస్త : ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్

సికింద్రాబాద్​ను స్వర్గంలా మారుస్త :  ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్
  • సికింద్రాబాద్​ను  స్వర్గంలా మారుస్త​
  • ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్

సికింద్రాబాద్, వెలుగు : తనను ముఖ్యమంత్రిని  చేస్తే సికింద్రాబాద్​నియోజకవర్గాన్ని స్వర్గంలా మారుస్తానని ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్​ అన్నారు. సోమవారం ఆయన ​తుకారాం గేట్​ రైల్వేస్టేషన్ ఏరియాలోని మాంగర్​బస్తీలో పర్యటించారు. అక్కడున్న సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం  పాల్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ పేరిట ప్రజలను సీఎం కేసీఆర్​ పదేండ్లుగా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆయన విడుదల చేసిన మేనిఫెస్టో లోని ఒక్క అంశం కూడా నెరవేర్చదగినదిగా  లేదని తెలిపారు.