ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్న

 ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్న

ఖైరతాబాద్, వెలుగు: పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌ కేసులో నిందితుడిగా ఉన్న సీఎం కేసీఆర్‌‌‌‌.. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌‌‌‌ను ఎలా కలుస్తారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. చీఫ్ జస్టిస్‌‌‌‌ను కేసీఆర్ కలవడం వెనుక ఆంతర్యమేమిటని అడిగారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బెయిల్ పిటిషన్ ఇంకా పెండింగ్‌‌‌‌లో ఉందని, ఈ సమయంలో కేసీఆర్ చీఫ్ జస్టిస్‌‌‌‌ను కలవడం ఎంతవరకు కరెక్ట్‌‌‌‌ అని ప్రశ్నించారు. చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ను కలిసిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. ఎవరు తప్పు చేసినా తాను విడిచిపెట్టనని, కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై తాడోపేడో తేల్చుకుంటానన్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను గద్దెదించే వరకు నిద్రపోనని, రాష్ట్రంలో అవినీతి పాలనపై పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.