లైంగిక వేధింపుల కేసు ; ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు అరెస్ట్

 లైంగిక వేధింపుల కేసు  ;  ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు అరెస్ట్

కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. మాజీ  ప్రధాని దేవేగౌడ మనువడు జేడీఎస్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ.. లైంగిక దాడి కేసులో ఆరెస్టైన విషయం తెలిసిందే. తాజాగా ప్రజ్వల్‌ సోదరుడు డాక్టర్‌ సూరజ్‌ రేవణ్ణ కూడా లైంగిక వేధింపుల కేసులోనే అరెస్టయ్యాడు. ఎమ్మెల్సీ అయిన సూరజ్‌.. తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడని చేతన్‌ కేఎస్‌(27) అనే జేడీఎస్‌ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

లోక్‌సభ ఎన్నికల సమయంలో పరిచయమైన సూరజ్‌ను ఫాంహౌస్‌కు పిలిచి దాడికి యత్నించడని అతడు ఆరోపించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇవాళ సూరజ్ ను అరెస్ట్ చేశారు. చేతన్‌ కేఎస్‌ ను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం బెంగళూరుకు తరలించారు. 

అయితే ఎమ్మెల్సీ సూరజ్‌ అనుచరడైన శివకుమార్ అనే వ్యక్తి.. చేతన్ పై నిన్న హోళినరిసిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  రేవణ్ణను రూ.5 కోట్లు ఇవ్వాలని చేతన్ డిమాండు చేశాడని.. ఇవ్వకపోతే లైంగికదాడి చేసినట్టు కేసు పెడతానని బెదిరించినట్టు అందులో పేర్కొన్నాడు.