
కన్నడ భామ ప్రణీత సుభాశ్(Pranitha Subhash) ట్రోలర్స్‌కు గట్టి పంచ్ ఇచ్చింది. భీమన అమావాస్య సందర్భంగా ఆమె తన భర్త పాదాలకు పూజ చేసి ఆ ఫొటోలను నెట్టింట పంచుకుంది. గతేడాది సైతం ఇలాంటి ఫొటోలు షేర్ చేయగా ఆమెపై ఓ వర్గం తీవ్రంగా విరుచుకుపడింది.
ఈ విషయాన్ని తన తాజా పోస్ట్‌లో ప్రస్తావిస్తూ.. గతేడాది ఈ పని చేసినందుకు నన్ను ఎంతోమంది ట్రోల్స్ చేశారు. కానీ, నా వరకు మాత్రం ఇది నా సనాతన ధర్మం అని తెలిపింది. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్ను అయినంత మాత్రాన నా ధర్మాన్ని పాటించకుండా ఉండలేను అని తెలిపింది.
భీమన అమావాస్య రోజున భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని స్త్రీలు ఈ పూజ చేయడం కర్నాటకలో సంప్రదాయంగా వస్తోంది. తాను ఎంత మోడ్రన్‌గా ఉన్నా అది సినిమాల వరకేనని స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా తన నమ్మకాలు తనకుంటాయని ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చింది.