
పాట్నా: బీజేపీతో కలిసి నితీశ్ ఏర్పాటు చేసిన కొత్త కూటమి ఎక్కువ కాలం నిలవదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. ‘నితీశ్ ఎప్పుడైనా జంప్ కావొచ్చని నేను మొదటి నుంచి చెబుతున్నా. మారడం ఆయన రాజకీయాల్లో భాగం. ఆయనో ‘పాల్తుమార్’. ఒక్క నితీశ్ మాత్రమే కాదు.. బీజేపీతో పాటు ఇతర ప్రతి నాయకుడు ఒక ‘పాల్తుమార్’ అని రుజువైంది. నిన్న మొన్నటి వరకు అనేక సమస్యలపై నితీశ్‌ను నిందించిన బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ ఆయనకు స్వాగతం పలుకుతున్నారు’ అని విమర్శించారు. 2025లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా బీజేపీ- జేడీయూ కూటమి స్థిరంగా ఉండదన్నారు. బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఒక ఏడాది లేదా దాని కంటే తక్కువే కొనసాగుతుందని తెలిపారు.