Prasanth Varma: వెల్కమ్ టూ అంజనాద్రి 2.0.. జై హనుమాన్ వీడియో విడుదల చేసిన ప్రశాంత్

Prasanth Varma: వెల్కమ్ టూ అంజనాద్రి 2.0.. జై హనుమాన్ వీడియో విడుదల చేసిన ప్రశాంత్

జై హనుమాన్(Jai Hanuman).. ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ ఇదే. దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth Varma) బ్లాక్ బస్టర్ హనుమాన్(HanuMan) సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈ సినిమా కోసం, అప్డేట్స్ కోసం  ఆడియన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.

ఇటీవల అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్బంగా జై హనుమాన్ సినిమా వర్క్ స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించాడు ప్రశాంత్. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. హనుమాన్ సినిమా కోసం అంజనాద్రి ఊరును క్రియేట్ చేసిన ప్రశాంత్.. జై హనుమాన్ కోసం అంజనాద్రి 2.0 ను క్రియేట్ చేస్తున్నారు. దీనికి సంబందించిన ఒక వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు ప్రశాంత్. దానికి వెల్ కమ్ టూ అంజనాద్రి 2.0.. అనే క్యాప్షన్ ను యాడ్ చేశాడు. 

ఈ వీడియోలో హనుమాన్ సినిమాలో మాదిరిగానే చుట్టూ కొండలు, మధ్యలో నది అందులో పడవలతో చాలా అద్భుతంగా ఉంది. ఆ వీడియోకి రఘునందన.. రఘు.. రఘునందన అనే పాటను యాడ్ చేశారు. వీడియోలో విజువల్స్ కి, ఆ పాటకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో ఆ వీడియో కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్స్.. సినిమాను తొందరగా ఫినిష్ చెయ్ ప్రశాంత్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక జై హనుమాన్ సినిమా విషయానికి వస్తే.. హనుమాన్ సినిమాలో హనుమంతుని శక్తులు వచ్చిన హనుమంతు తన ఊరి కోసం పోరాడుతాడు. ఇక జై హనుమాన్ సినిమాలో ఈ భూమండలాన్ని అసురుల నుండి కాపాడటానికి రాముడికి ఇచ్చిన మాట కోసం సాక్షాత్తు హనుమంతుడే ఈ భూమి మీదికి రానున్నాడు. ఇదే కాన్సెప్ట్ తో జై హనుమాన్ సినిమా రానుందని ప్రశాంత్ ఇప్పటికే చెప్పేశాడు. ఇక ఈ సినిమాలో హనుమంతులవారి పాత్రలో ఒక స్టార్ హీరో కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.