ఆంధ్రప్రదేశ్​ గ్రామీణ వికాస్​ బ్యాంక్​ చైర్మన్​గా ప్రతాప రెడ్డి

ఆంధ్రప్రదేశ్​ గ్రామీణ వికాస్​ బ్యాంక్​ చైర్మన్​గా ప్రతాప రెడ్డి

వరంగల్ సిటీ, వెలుగు: స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా డిప్యూటీ జనరల్​ మేనేజర్​ కె.ప్రతాప రెడ్డి ఆంధ్రప్రదేశ్​ గ్రామీణ వికాస్​ బ్యాంక్​ చైర్మన్​గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం చైర్మన్​ప్రవీణ్​ కుమార్​ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు.  

ప్రతాపరెడ్డి    20 ఏళ్లపాటు ఎస్​బీఐ భోపాల్​ సర్కిల్​ లో రియల్​ ఎస్టేట్​ హౌజింగ్​ బిజినెస్​ యూనిట్​ను నడిపించారు. ఆ తరువాత ఏపీజీవీబీలో చేరారు. ఎస్​బీఐలో కమర్షియల్​ క్రెడిట్  సహా దేశీయ, విదేశీ అసైన్​మెంట్ల కోసం పనిచేశారు.

నిజామాబాద్​, హిమాయత్​ నగర్​ రీజియన్​ మేనేజర్​గా గ్రామీణ, సెమీ అర్బన్​, అర్బన్​, మెట్రో బ్రాంచ్​లను పర్యవేక్షించారు.  ప్రతాప్​ ఏపీజీవీబీ చైర్మన్​ గా ఐదేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీజీవీబీ తెలంగాణ, ఏపీలోని 28 జిల్లాల కస్టమర్లకు సేవలు అందిస్తోందన్నారు. తమకు 771 శాఖలు ఉన్నాయని చెప్పారు.