అశ్రునయనాల మధ్య ముగిసిన ప్రవల్లిక అంత్యక్రియలు

అశ్రునయనాల మధ్య  ముగిసిన ప్రవల్లిక అంత్యక్రియలు

అశ్రునయనాల మధ్య ప్రవల్లిక అంత్యక్రియలు ముగిశాయి.  వరంగల్ జిల్లా జిక్కాజిపల్లి గ్రామంలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రవల్లికను చివరిసారిగా చూసేందుకు ఊరంతా కదలివచ్చింది. అంతకుముందు ఉద్రిక్తతలు,  భారీ పోలీస్ బందోబస్తు నడుమ ప్రవల్లిక అంతిమయాత్ర కొనసాగింది.  ఈ అంతిమయాత్రకు బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ నేతలు హాజరయ్యారు.   ప్రవల్లిక కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కేయూ, ఓయూ నేతలు ఆందోళనకు దిగారు.  ఈ క్రమంలో పోలీసులు వారిని ఆరెస్ట్ చేసి చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

కాగా  వరంగల్ కు చెందిన విద్యార్థిని ప్రవల్లిక (25) హైదరాబాద్ అశోక్​నగర్​ లో ఉంటూ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంది.  అయితే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదా పడటంతో మనస్తాపనికి గురైన ప్రవల్లిక  శుక్రవారం (అక్టోబర్ 13న) ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ ను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  హాస్టల్ లో ఉంటూ  చదువుకుంటున్న  ప్రవల్లిక ఇలా ఆత్మహత్య చేసుకుని కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

ALSO READ : అక్టోబర్ 20 నుంచి పాఠశాలలకు 10 రోజుల దుర్గాపూజ సెలవు