బస్ షెల్టరా..? పార్కింగ్ అడ్డానా?.. గాంధీ ఆస్పత్రి బస్ షెల్టర్ పరిస్థితి ఇది..!

బస్ షెల్టరా..? పార్కింగ్ అడ్డానా?.. గాంధీ ఆస్పత్రి బస్ షెల్టర్ పరిస్థితి ఇది..!

సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్​ ఎంసీహెచ్​ విభాగ భవనం సమీపంలో ఉన్న బస్​ షెల్టర్ ప్రైవేట్ వాహనాల పార్కింగ్​కు అడ్డాగా మారింది. వందలాది మంది గర్భిణులు, బాలింతలు, వారి సహాయకులతో ఈ బస్​ షెల్టర్​ నిత్యం బిజీగా ఉంటుంది. అయితే ఇక్కడి ప్రైవేట్​ ఆటోలు, కార్లు, ఇతర వాహనాలను​ నిలుపుతుండడంతో వారికి ఇబ్బందిగా మారుతోంది. ప్రయాణికులు షెల్టర్​లోకి వెళ్లడానికి వీలు లేకుండా, రోడ్డుపైనే నిలబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఆర్టీసీ, ట్రాఫిక్​ పోలీస్​ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.