వానాకాలంలో కిచెన్‌ ను ఇలా ఉంచుకుందాం

వానాకాలంలో కిచెన్‌ ను ఇలా ఉంచుకుందాం

వానాకాలం ఎంత హాయిగా అనిపిస్తుందో అంతే ఇబ్బందిగా కూడా ఉంటుంది. ముఖ్యంగా కిచెన్‌‌లో ఎక్కువగా ఆ ఇబ్బందులు కనిపిస్తాయి. కిచెన్‌‌ తడితడిగా ఉంటే చిరాకుగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రానిక్‌‌ ఐటమ్స్‌‌ ఎక్కువగా వాడేది కిచెన్‌‌లోనే. స్విచ్‌‌ బోర్డులు, వైర్లు ఎక్కువగానే ఉంటాయి. వైర్లు లూజ్‌‌ అవ్వడం, గోడల్లో తేమ శాతం ఎక్కువ అవ్వడం వల్ల  షాక్‌‌ కొట్టడం, షార్ట్‌‌ సర్క్యూట్‌‌ లాంటివి జరుగుతాయి. కాబట్టి వర్షాకాలం మొదలవుతున్నప్పుడే కిచెన్‌‌లోని వైరింగ్‌‌ను సరిచూసుకోవాలి. ఏవైనా రిపేర్లు ఉంటే వెంటనే చేయించుకోవాలి. వర్షాకాలంలో కిచెన్​లో వెంటిలేషన్​ బాగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో గోడల నుంచి వచ్చే ఒక రకమైన వాసన పోయేందుకు కిచెన్​లో​ వెంటిలేషన్‌‌ అవసరం. వర్షాల వల్ల డ్రైనేజ్‌‌ ప్రాబ్లమ్స్‌‌ ఎక్కువగా వస్తాయి. కాబట్టి ముందుగానే డ్రైనేజ్‌‌ లీకేజ్‌‌లు, ట్యాప్‌‌లను సరి చూసుకుంటే మంచిది. పురుగులు, దోమలు, ఈగలకు కిచెన్‌‌ గెస్ట్‌‌హౌస్‌‌ లాంటిది. క్లీన్‌‌గా లేకుంటే అవి ఇంకా ఎక్కువ అవుతాయి. అందుకే కిచెన్‌‌ను ఎప్పుడూ డ్రైగా ఉంచాలి. వర్షాకాలం వచ్చిందంటే పురుగులు ఇంకా పెరిగిపోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు డిస్‌‌ ఇన్ఫెక్టెంట్స్‌‌ వాడుతూ కిచెన్‌‌ను క్లీన్‌‌ చేస్తూ, వీలైనంత వరకు తేమ లేకుండా ఉంచుకోవాలి.