ఒంటరిగా సౌత్ ​పోల్ కు వెళ్లి హిస్టరీ క్రియేట్

ఒంటరిగా సౌత్ ​పోల్ కు వెళ్లి హిస్టరీ క్రియేట్

వాతావరణం చల్లగ ఉందంటే... ఇంట్లో నుంచి బయటకు పోడానికి జంకుతారు చాలామంది. దానికి మంచు తోడయితే.... అడుగుకూడా కదపరు. కానీ, సాహసయాత్రల్ని ఇష్టపడే ప్రీత్​ చండీ మాత్రం  మైనస్ 50 ​ డిగ్రీల చలిలో, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే  సౌత్​పోల్​కు వెళ్లింది. అది కూడా ఒంటరిగా. 
బ్రిటిష్​ సిఖ్​​ ఆర్మీ ఆఫీసర్​గా పనిచేస్తోంది​ ప్రీత్. సౌత్​పోల్​ టూర్​కు వెళ్లిన మహిళగా హిస్టరీ క్రియేట్ చేసిన ఈమె భారత సంతతికి చెందింది. ఆమె పంజాబీ సిఖ్​ యువతి ‘‘ఈ అడ్వెంచరస్​ ట్రిప్ ఎందుకని అడిగితే... ‘జీవితంలో ఏదీ సాధించలేమని అనుకునేవాళ్లలో ధైర్యం నింపడం కోసం. అసాధ్యం అనేది లేదని చెప్పడం కోసం’ అంటున్న  ఆమె అడ్వెంచరస్​​ జర్నీ గురించి...

‘‘దక్షిణ ధృవం(సౌత్​ పోల్​)లో మంచు కురిసే చోటుకి వెళ్లడం అనేది చాలా ఎమోషనల్​గా అనిపించింది. ఇప్పుడు తలచుకుంటే అదంతా ఒక కలలా అనిపిస్తోంది”అంటూ తన సంతోషాన్ని బ్లాగ్​లో రాసుకుంది ప్రీత్​ చండీ. పోయిన ఏడాది నవంబర్​1వ తారీఖున ఆమె అడ్వంచరస్​​ జర్నీ మొదలైంది. అంటార్కిటికా మంచు ఖండం గుండా ఒంటరిగా స్కైయింగ్​ చేస్తూ వెళ్లింది. 1,126 కిలోమీటర్లు ట్రావెల్​ చేసి ఈ జనవరి 3న సౌత్​పోల్​కు చేరుకుంది​. తన అడ్వెంచరస్​​ ట్రిప్​ సంగతుల్ని ఏరోజుకారోజు వాయిస్​ బ్లాగ్​లో చెప్తుండేది​.  

రెండేండ్ల ప్రాక్టీస్​
లండన్​లోని క్వీన్​ మేరీ యూనివర్సిటీలో స్పోర్ట్స్, ఎక్సర్​సైజ్​ మెడిసిన్​లో డిగ్రీ చదివింది ప్రీత్​. తర్వాత ఫిజియోథెరపిస్ట్​గా ట్రైనింగ్​ తీసుకుంది. ప్రస్తుతం బ్రిటీష్​ ఆర్మీలోని వైద్య సిబ్బందికి క్లినికల్​ ట్రైనింగ్​ ఆఫీసర్​గా పనిచేస్తోంది. ఈమధ్యే సౌత్​ సూడాన్​లో ఐక్యరాజ్యసమితి శాంతి దళంలో ఆరునెలలు పనిచేసింది కూడా. అడ్వెంచర్​ టూర్లని ఇష్టపడే ప్రీత్​ అసాధ్యం అనేది ఏదీ లేదని నమ్ముతుంది. తాను నమ్మడమే కాదు భయంతో ఏదీ సాధించలేని వాళ్లలో ధైర్యం నింపాలనుకుంది. అందుకోసం అంటార్కిటికాలో ఉన్న సౌత్​పోల్​కు వెళ్లాలనుకుంది. నిజానికి అది అడ్వెంచరస్​ జర్నీ. అందుకని ఫిజికల్​గా ఫిట్​గా ఉండటం కోసం అంటార్కిటికాలో పెద్ద స్లెడ్జ్​ ని లాక్కెళ్లడం ప్రాక్టీస్​ చేసింది. 90 కిలోల బరువున్న ఆ స్లెడ్జ్​ మీద తన ట్రావెల్​ కిట్, ఫుడ్​, ఫ్యూయెల్​ పెట్టుకుని, దాన్ని లాక్కెళ్లుతూ నడవడం అలవాటు చేసుకుంది. ఆల్ఫ్స్​ పర్వతాల్లో పెద్ద పెద్ద మంచు గుట్టల మీద  పట్టు జారకుండా నడవడం నేర్చుకుంది. ఐస్​లాండ్​లో ట్రెక్కింగ్ చేయడమే కాదు  గ్రీన్​లాండ్, నార్వేలో సాహసయాత్రల్లో ట్రైనింగ్​ తీసుకుంది. ఇలా దాదాపు రెండున్నరేండ్లు కష్టపడి సౌత్​పోల్​ జర్నీకి రెడీ అయింది.

ఎంకరేజ్​ చేయడం కోసమే...
‘‘ఈ భూమ్మీద అత్యంత చల్లగా, అత్యంత పొడిగా ఉండే, బలమైన గాలులు వీచే ప్రాంతం అంటార్కిటికా. ఈ అడ్వెంచరస్​​ ట్రిప్ ప్లాన్​ చేయడాని​కి ముందు నాకు అంటార్కిటికా గురించి చాలా తక్కువ తెలుసు. ఈ ప్రాంతం గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో ట్రిప్​కు​ వెళ్లాను. ఏ పనీ అసాధ్యం కాదని నమ్మే నేను అందరికీ రోల్​మోడల్​గా ఉండే పనిచేయాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఎంత పెద్ద లక్ష్యమైనా మొదట్లో అసాధ్యంగానే కనిపిస్తుంది. అయితే, ట్రైనింగ్ ముగిసే టైం​కి నా గోల్​కి మరింత దగ్గరైనట్టు అనిపించింది. ఈ సాహసయాత్ర నా ఒక్కదానికోసమే కాదు చాలామందికోసం. భయాల్ని వదిలి, తమని తాము నమ్మేలా ఎంకరేజ్​ చేయాలనేది నా కోరిక. జీవితంలో ఏదైనా సాధించేందుకు బోలెడు అవకాశాలు ఉంటాయని ఈ జనరే షన్​ పిల్లలు తెలుసుకోవాలి” అంటూ తన సౌత్​పోల్​ జర్నీ గురించి చెప్పింది ప్రీత్​.