
ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల(Preeti Pagadala) హీరోయిన్ గా నటిస్తున్న తొలి చిత్రం పతంగ్(Patang). ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ప్రణీత్ ప్రత్తిపాటి తెరకెక్కిస్తున్నాడు. పతంగుల పోటీ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతి పగడాల పతంగ్ సినిమా గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అవకాశం వస్తే ఇంటిమేట్ సీన్స్, లిప్‌లాక్ సీన్స్ చేస్తారా అని అడిగారు యాంకర్. దానికి సమాధానంగా ప్రీతి మాట్లాడుతూ.. నో..సినిమాల్లోకి వస్తున్నప్పుడు మా నాన్న ఒకేఒక కండీషన్ పెట్టారు. అది లిప్‌లాక్ సీన్లు వద్దని. ఇప్పటివరకు నేను అడిగిన ప్రతీది వారు అంగీకరించారు. అందుకే.. నాన్న పెట్టిన ఆ ఒక్క కండీషన్‌ను దాటకూడదని ఫిక్స్ అయ్యాను. ఇంటిమేట్ సీన్లు చేస్తారా అని ఇప్పటికే చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ, నేను నో చెప్పాను. ఒకవేళ పరిమితిలో ఉంటె ఇంటిమేట్ సీన్స్ చేయడానికి ఒకే. ఇక గ్లామర్‌గా కనిపిండం అంటారా.. ఈరోజుల్లో పొట్టి పొట్టి డ్రస్‌లు వేసుకోవడం అనేది సాధారణంగా మారిందని. అందుకే అలాంటి వాటిలో మాత్రం నో లిమిట్స్. అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు ప్రీతి పగడాల. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.