భద్రాచలం: భూత వైద్యం వికటించి గర్భిణి మృతి

భద్రాచలం: భూత వైద్యం వికటించి గర్భిణి మృతి

భద్రాచలం, వెలుగు: భూత వైద్యం వికటించి ఆరు నెలల గర్భిణి చనిపోయింది. భద్రాచలం ఏజెన్సీ బార్డర్​లోని ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట బ్లాక్​ మారాయిగూడెం గ్రామానికి చెందిన కురసం హెన్కి గొంతు వాపుతో బాధపడుతోంది. ఆమెను కుటుంబ సభ్యులు అదే గ్రామంలోని ఓ భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అతను ఆమె గొంతును బలంగా కొరికి వైద్యం చేయడంతో ఇన్​ఫెక్షన్​ సోకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. 

దీంతో ఈ నెల 14న భద్రాచలం ఏరియా ఆసుపత్రికి ఆమెను తీసుకొచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్​ డా.రాజశేఖర్​రెడ్డి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఐసీయూలో చేర్చి కృత్రిమ శ్వాసను అందించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం అర్ధరాత్రి దాటాక హెన్కి చనిపోయింది. సదరు భూత వైద్యుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.