- బాన్సువాడ ఏరియా హాస్పిటల్‌లో ఘటన
బాన్సువాడ, వెలుగు : గొంతులో ఇడ్లీ ఇరుక్కొని ఊపిరాడక బాలింత చనిపోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా హాస్పిటల్‌లో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. పిట్లం మండలం బండపల్లికి చెందిన అర్చన (21) బాన్సువాడ ఏరియా హాస్పిటల్‌లో శుక్రవారం డెలివరీ అయింది.
కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు ఇడ్లీ తీసుకొచ్చి అర్చనకు తినిపించారు. ఈ క్రమంలో ఇడ్లీ గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక ఇబ్బంది పడింది. వెంటనే డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో అర్చన చనిపోయింది. చిన్నారి పుట్టిన కొద్దిసేపటికే తల్లి చనిపోవడం కుటుంబంలో విషాదాన్ని నింపింది.

