రాష్ట్రపతి నిలయాన్ని  ఇక రోజూ చూడొచ్చు

రాష్ట్రపతి నిలయాన్ని  ఇక రోజూ చూడొచ్చు
  •     వర్చువల్​గా ప్రారంభించిన ప్రెసిడెంట్ ​ద్రౌపది ముర్ము
  •     పాల్గొన్న గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని ఇ క నుంచి ఏడాది పొడవునా సందర్శించవచ్చు. ఈ అవకాశాన్ని బుధవారం తెలుగు నూతన సంవత్స రం ఉగాది సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఉదయం 11 గంటలకు ప్రెసిడెంట్ ​ద్రౌపది ముర్ము వర్చువల్​గా ప్రారంభించారు. నాలెడ్జ్ గ్యాలరీ, పార్క్, సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన సెంటర్, 120 అడుగుల జాతీయ జెండా, జైహింద్ ర్యాంప్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రోగ్రాంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ ​శాంతికుమారి పాల్గొన్నారు. ఇప్పటిదాకా ప్రతి శీతాకాలంలో రాష్ట్రపతి వచ్చినప్పుడే సందర్శించడానికి 15 రోజులు అవకాశం కల్పించేవారు.

బుధవారం నుంచి ఏడాదంతా సందర్శించడానికి చాన్స్​ కల్పించారు. రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి ప్రాంగణం ప్రతి భారతీయుడికి చెందుతాయన్నారు. యువత స్వాతంత్ర్య సమరయోధుల గురించి తెలుసుకోవాలన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని  రాష్ట్రపతి నిలయంలో నాలెడ్జ్ గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు, ము ఖ్యంగా పిల్లలు, యువత నిలయాన్ని సందర్శించి, వారి వారసత్వంతో మమేకం కావాలని కోరారు.

వారంలో ఆరు రోజులు

రాష్ట్రపతి నిలయం వారంలో ఆరు రోజులు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. సోమవారం, గవర్నమెంట్​హాలిడేస్​లో మూసిఉంచుతారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిలయాన్ని సందర్శించవచ్చు. ఇందుకు గాను మన దేశం వాళ్ల నుంచి రూ.50, విదేశీయుల నుంచి  రూ.250  నామమాత్రపు రిజిస్ట్రేషన్ చార్జీ  వసూలు చేస్తారు. టికెట్లు ఆన్ లైన్ లో లేదా రాష్ట్రపతి నిలయం రిసెప్షన్ వద్ద తీసుకోవచ్చు. టూర్ గైడ్​తో పాటు పార్కింగ్, క్లాక్ రూమ్, వీల్ చైర్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.