బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవులు బీసీలకే ఇవ్వాలి : దాసు సురేశ్

బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవులు బీసీలకే ఇవ్వాలి : దాసు సురేశ్

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణలో మారుతున్న సామాజిక, రాజకీయ పరిణామాలు లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించాయని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ చెప్పారు. బీసీలకు అత్యధిక సీట్లను కేటాయించిన పార్టీకి బీసీలు అగ్ర తాంబూలం అందించారని తెలిపారు. బీసీల్లోని రాజకీయ చైతన్యాన్ని ప్రధాన పార్టీలు గమనించాలన్నారు. 

బీజేపీ, కాంగ్రెస్​రాష్ట్ర అధ్యక్ష పదవులను బీసీ నేతలకే కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్​నలుగురు బీసీలకు మంత్రులుగా అవకాశం ఇవ్వగా, ప్రస్తుత కాంగ్రెస్​ప్రభుత్వం కేవలం ఇద్దరికే ఇచ్చిందన్నారు. బీసీల ఆకాంక్షలను, అవకాశాలను విస్మరిస్తే రాజకీయ పార్టీలకు అధోగతి తప్పదని సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు..