పంజాబ్ ఘటనను ఖండించిన రామ్నాథ్, వెంకయ్య 

పంజాబ్ ఘటనను ఖండించిన రామ్నాథ్, వెంకయ్య 

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కలిశారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన మోడీ.. కోవింద్ తో భేటీ అయ్యారు. పంజాబ్ లో బుధవారం జరిగిన ఘటన గురించి రాష్ట్రపతికి వివరించారు. ఫిరోజ్ పూర్ వెళ్లే మార్గంలో భద్రతా లోపాలపై రాష్ట్రపతికి ప్రధాని  వివరించారు. ఘటనపై కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు.

పంజాబ్ ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మోడీకి ఫోన్ చేసిన ఆయన.. పంజాబ్ టూర్ లో భద్రతా వైఫల్యాలపై ఆరా తీశారు. భద్రతా వైఫల్యానికి కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌‌లో సభకు వెళ్లేందుకు ప్రధాని మోడీ బఠిండా ఎయిర్‌‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో వెళ్తుండగా.. రైతులు ఆయన కాన్వాయ్‌ను బ్లాక్ చేశారు. దీంతో దాదాపు 20 నిమిషాల పాటు ఓ ఫ్లైఓవర్‌‌పై చిక్కుకుపోయిన ప్రధాని.. ఆ తర్వాత సభకు వెళ్లకుండానే ఎయిర్‌‌పోర్టుకు వెనుదిరిగారు.

మరిన్ని వార్తల కోసం: 

పోలీసుల విచారణకు రాఘవను అప్పగిస్తా

సింపతీ కోసం మోడీ చీప్‌ ట్రిక్స్

నీ పాలనను కూల్చే రైతు పోరాటాన్ని ఆపలేవ్