
హైదరాబాద్: అధికారాన్ని ఇస్తే ఆదుకుంటాయనుకున్న ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మర్చిపోయాయని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. ప్రభుత్వాలు రైతుల ప్రాణాలతో ఆడుకుంటున్నాయని దుయ్యబట్టారు. అందుకే కడుపుమండిన రైతన్న ప్రధాన మంత్రికి కూడా చుక్కలు చూపించారని బుధవారం ఫిరోజ్ పూర్ లో మోడీని అన్నదాతలు అడ్డుకున్న ఘటనను ప్రస్తావిస్తూ షర్మిల ట్వీట్ చేశారు. మోడీని రైతులు వెనక్కి పంపారని, తిరగబడ్డ ఈ అన్నదాతలు రేపు కేసీఆర్ అధికారానికి కర్రు కాల్చి వాత పెడతారని చెప్పారు.
అధికారం ఇస్తే ఆదుకుంటాయనుకున్న ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మరిచి, రైతుల ప్రాణాలతో ఆడుకుంటుంటే, కడుపుమండిన రైతన్న ప్రధానమంత్రికి సైతం చుక్కలు చూపించారు.వెనక్కి పంపించారు.
— YS Sharmila (@realyssharmila) January 6, 2022
తిరగబడ్డ ఈ రైతులే రేపు KCR అధికారానికి కర్రుకాల్చి వాత పెడుతారు. వరి కొనకుండా
రైతుకు చితి పేర్చుతుంటే 1/2
‘వరి కొనకుండా రైతుకు చితి పేర్చుతుంటే రైతుకు చితి పేర్చుతుంటే వీధిన పడ్డ రైతుకు అండగా మేం రైతు ఆవేదన యాత్రతో ధైర్యాన్ని నింపుతుంటే, ఆపడానికి మీరు కరోనా రూల్స్ అడ్డుపెట్టి సంబరపడిపోవచ్చు. కానీ మీ నియంత పాలనకు వ్యతిరేకంగా ముంచుకొస్తున్న మరో రైతాంగ పోరాటాన్ని ఎవరూ ఆపలేరు’ అని షర్మిల స్పష్టం చేశారు.
మరిన్ని వార్తల కోసం: