బండి నడపడానికి లైసెన్స్ అవసరం లేదు.. విద్యార్థి వాదన

బండి నడపడానికి లైసెన్స్ అవసరం లేదు.. విద్యార్థి వాదన

సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులకు విచిత్ర సంఘటన ఎదురైంది. పాత బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ బాలుడు చిక్కాడు. స్కూటీపై బ్యాగులు వేసుకొని పాఠశాల నుంచి ఇంటికి దర్జాగా వెళ్తూ కనిపించాడు. దాంతో పోలీసులు బాలుడిని ఆపారు. నువ్వు స్టూడెంట్ కదా.. మరి స్కూటీ వేసుకొని ఎక్కడకు వెళ్తున్నావు అని ప్రశ్నించారు. శ్రీ చైతన్య పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆ బాలుడు చెప్పిన సమాధానం విని పోలీసులు నోరేళ్లబెట్టారు. తాను రోజూ బండి మీదే స్కూల్‎కు వెళ్తానని.. ఈ బండి నడపడానికి లైసెన్స్ అవసరం లేదు కాబట్టి మీరు ఆపకూడదని బదులిచ్చాడు. పైగా మా నాన్న ఎంపీటీసీ.. నన్నే ఆపుతారా అంటూ ఎదురు ప్రశ్నించాడు. అవాక్కయిన పోలీసులు.. వెంటనే బాలుడి తండ్రికి ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలకు బండి ఇవ్వకూడదని సూచించారు. ఏ చట్టంలో కూడా లైసెన్స్ లేకుండా బండి నడపాలని లేదని.. మరోసారి రిపీట్ అయితే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు. అనంతరం బాలుడి బంధువులను పిలిపించి స్కూటీని అప్పగించి పంపించారు.

For More News..

ఉమెన్స్ వరల్డ్ కప్‎కు సైన్యం సిద్దం

పెండ్లి కోసం రోడ్డుకెక్కిన యువకుడు