కేంద్ర నిధులతోనే వరంగల్‌‌‌‌ అభివృద్ధి: రావు పద్మ

కేంద్ర నిధులతోనే వరంగల్‌‌‌‌ అభివృద్ధి: రావు పద్మ

హనుమకొండ, వెలుగు : కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వరంగల్‌‌‌‌ అభివృద్ధి జరిగిందని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ చెప్పారు. వరంగల్‌‌‌‌ పశ్చిమ నియోజకవర్గం కొత్తూరు ఏరియాలో బుధవారం డివిజన్ అధ్యక్షుడు చింతల రఘుపతి అధ్వర్యంలో ‘ఇంటింటికీ  బీజేపీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రావు పద్మ డివిజన్‌‌‌‌లోని ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. 

అనంతరం ఆమె మాట్లాడుతూ వరంగల్‌‌‌‌ అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్రం ఇతర పనులకు మళ్లిస్తోందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రధాని బలపరిచి, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను గద్దె దించితేనే రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పాశికంటి రాజేంద్రప్రసాద్, నాయకులు గట్టు రాజమౌళి, సంతోశ్‌‌‌‌యాదవ్‌‌‌‌, సతీశ్‌‌‌‌, శ్రీనివాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు. అనంతరం ‘నా మట్టి -నా దేశం’ కార్యక్రమంలో భాగంగా మాజీ సైనికులను సన్మానించరు.