గ్యాస్ లీక్ ఘటనపై రాష్ట్రపతి రామ్​నాథ్ విచారం

గ్యాస్ లీక్ ఘటనపై రాష్ట్రపతి రామ్​నాథ్ విచారం

న్యూఢిల్లీ: ఏపీలోని వైజాగ్ లో జరిగిన గ్యాస్ లీక్ ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పరిస్థితి త్వరగా అదుపులోకి రావాలని ఆకాంక్షించారు.

చాలా బాధాకరం: జేపీ నడ్డా
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటన గురించి వినడం చాలా బాధ కలిగించిందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ట్వీట్ చేశారు. చనిపోయినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో అందరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. హెల్త్ ప్రొటోకాల్ పాటిస్తూ అక్కడి అధికారులతో కలిసి సాధ్యమైనంత మేరకు సాయం అందించాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.

విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురం దగ్గర ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గురువారం తెల్లవారుజామున గ్యాస్ లీకైంది. దీని ప్రభావంతో ఎనిమిది మంది చనిపోయారు. వెయ్యిమందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వారందర్నీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో జిల్లా అధికారులు అప్రత్తమై సహాయక చర్యలు చేపట్టారు. కంపెనీకి రెండుమూడు కిలోమీటర్ల పరిధిలో ఉంటున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.