ప్రిగోజిన్.. జాగ్రత్త! వాగర్న్ చీఫ్ కు సీఐఏ మాజీ చీఫ్ హెచ్చరిక

ప్రిగోజిన్.. జాగ్రత్త! వాగర్న్  చీఫ్ కు సీఐఏ  మాజీ చీఫ్ హెచ్చరిక

వాషింగ్టన్: పుతిన్  నేతృత్వంలోని రష్యా సేనలపై ఇటీవలే తిరుగుబాటు లేవదీసిన వాగ్నర్  చీఫ్​ యవ్జెనీ ప్రిగోజిన్  జాగ్రత్తగా ఉండాలని అమెరికాకు చెందిన సెంట్రల్  ఇంటెలిజెన్స్  ఏజెన్సీ (సీఐఏ) మాజీ చీఫ్​ డేవిడ్  పెట్రాయస్  హెచ్చరించారు. రష్యా మిలటరీ లీడర్లపై తిరుగుబాటు చేసి వెనక్కి తగ్గినపుడే ప్రిగోజిన్  తన స్థైర్యాన్ని కోల్పోయారని డేవిడ్  అన్నారు. అమెరికా న్యూస్  చానెల్  సీఎన్ఎన్ తో ఆయన మాట్లాడారు. ‘‘ప్రిగోజిన్  తన ప్రాణం కాపాడుకోవడానికి తిరుగుబాటు నుంచి పలాయనం చిత్తగించారు.

ALSO READ:మేరా బూత్ సబ్‌‌‌‌సే మజ్బూత్.. ప్రారంభించనున్నప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

కానీ వాగ్నర్  గ్రూపును ఆయన కోల్పోయారు. ఈ నేపథ్యంలో బెలారస్ లో ఆయన బయట తిరుగుతున్నపుడు జాగ్రత్తగా ఉండాలని నేను హెచ్చరిస్తున్నా” అని డేవిడ్  వ్యాఖ్యానించారు. కాగా, వాగ్నర్  సైన్యం తిరుగుబాటుతో రష్యాలో అంతర్యుద్ధం వచ్చే పరిస్థితి కనిపించింది. కానీ, బెలారస్  మధ్యవర్తిత్వంతో త్రుటిలో ముప్పు నుంచి తప్పించుకొంది. క్రెమ్లిన్ తో ఒప్పందం తర్వాత ప్రిగోజిన్.. బెలారస్  వెళ్లిపోయారు.