ల్యాప్ టాప్ అంటే కనీసం రూ.40 వేలు పెట్టాలి.. ఇంకా మంచిది అయితే 60 వేల రూపాయలు.. హైఎండ్ టెక్నాలజీ అయితే లక్ష రూపాయల వరకు అవుతుంది. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ప్రైమ్ బుక్ ల్యాప్ టాప్ సంచలనాలు నమోదు చేస్తుంది. ప్రైమ్ బుక్ కొత్త వెర్షన్ రిలీజ్ చేసింది. 4జీ ఆండ్రాయిడ్ ల్యాప్ టాప్ బేస్ వేరియంట్ ధర 10 రూపాయలు తక్కువ.. 17 వేల రూపాయలుగా ఉంది. అదే 4జీబీ ర్యామ్, 128 బీజీ స్టోరేజ్ టాప్ వేరియంట్10 రూపాయలు తక్కువ.. 19 వేల రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చింది కంపెనీ. ఆన్ లైన్ క్లాసులు, ఈ లెర్నింగ్ వంటి వాటి కోసం వీటిని ప్రత్యేకంగా తయారు చేశారు.
ప్రైమ్ బుక్ 4జీ ల్యాప్ టాప్ హెచ్ డీ రెజల్యూషన్ 11.6ఇంచెస్ ఐపీఎస్ ఎల్ సీడీ డీస్ ప్లే కలిగి ఉంది. మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 200 జీబీ స్టోరేజీ వరకు పెంచుకునే వెసలుబాటు ఉంది. వైఫై, బ్లూటూత్, రెండు యూఎస్బీ పోర్టులు, హెడ్ ఫోన్ జాక్, మినీ మెచ్ డీఎంఐ పోర్టు కనెక్టివిటీ వంటి ప్యూచర్స్ కలిసి ఉండి.. కేజీ 200 గ్రాముల బరువు మాత్రమే ఉంది ఈ కొత్త వెర్షన్ ల్యాప్ టాప్. 2 మెగాపిక్సెల్ వెబ్ క్యామ్‌తో.. 4,000 ఎంఏహెచ్బ్యాటరీతో రన్ అవుతుంది. ప్రైమ్ బుక్ 4జీ ల్యాప్ టాప్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో మాత్రమే నడుస్తుంది.. ఇది విండోస్ అప్లికేషన్‌కు సపోర్ట్ చేయదు.. ఆండ్రాయిడ్ యాప్స్ అన్నీ పని చేస్తాయి.
