కిసాన్ డ్రోన్‌లను ప్రారంభించిన ప్రధాని మోడీ

కిసాన్ డ్రోన్‌లను ప్రారంభించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: రైతులకు మోడరన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే క్రమంలో శనివారం 100 కిసాన్ డ్రోన్లను ప్రధానమంత్రి మోడీ జెండా ఊపి ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో దేశంలోని పలు ప్రాంతాల్లో 100 కిసాన్ డ్రోన్లను ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్గా ప్రారంభించారు. రైతులకు సహాయపడే లక్ష్యంతో.. పొలాల్లో పురుగుల మందు పిచికారి చేసేందుకు కిసాన్ డ్రోన్ల కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ... భారత వ్యవసాయరంగంలో ఈ కార్యక్రమం ఓ సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందన్నారు. రాబోయే రెండేళ్లలో గరుడ ఏరోస్పేస్ ఆధ్వర్యంలో లక్ష డ్రోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పీఎం మోడీ అన్నారు. ఇది యువతకు ఉపాధి అవకాశాలను తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని రైతులు టెక్నాలజీని అందుపుచ్చుకోవాలని, వ్యవసాయానికి టెక్నాలజీ తోడైతే అద్భుతాలు సాధించవచ్చన్నారు.  రైతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోడీ. 

కాగా ఇటీవలి బడ్జెట్ సమావేశాల్లో  ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వ్యవసాయానికి సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావించారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా కిసాన్ డ్రోన్లు, కెమికల్ ఫ్రీ ఫామింగ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా రైతులకు డిజిటల్, టెక్నాలజీ సేవలు వంటి పలు అంశాల గురించి మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ డ్రోన్ సర్వీసులను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం: 

ప్రముఖ నటుడి సెకండ్ మ్యారేజ్

పవన్ మూవీ షూట్ కంప్లీట్