ప్రముఖ నటుడి సెకండ్ మ్యారేజ్

ప్రముఖ నటుడి సెకండ్ మ్యారేజ్

ముంబై: బాలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడు. సింగర్ శిబానీ దండేకర్ తో సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్న ఫర్హాన్.. ఆమెను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. శిబానీ, ఫర్హాన్ జంట ఈనెల 21 మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వనుందని తెలుస్తోంది. శిబానీ ఇంట్లో మెహిందీ ఫంక్షన్ తో ప్రీ వెడ్డింగ్ సందడి మొదలైంది. ఈ వేడుకకు ఆమె సమీప బంధువులు మాత్రమే హాజరయ్యారని తెలిసింది. ఈ కార్యక్రమానికి ఫర్హాన్ అక్తర్ సవతి తల్లి షబానా అజ్మీతోపాటు రియా చక్రవర్తి, అమృతా అరోరా కూడా అటెండ్ అయ్యారు. రణ్ వీర్ సింగ్ సింబా సినిమాలోని ఆంఖ్ మారే పాటకు శిబానీ స్టెప్పులు వేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఫర్హాన్ అక్తర్ పెళ్లి విషయంపై ఆయన తండ్రి, ప్రముఖ సినీ గేయ రచయిత జావేద్ అక్తర్ స్పందించారు. వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యాయని ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యారేజ్ సెలబ్రేషన్స్ ను భారీ ఎత్తున నిర్వహించలేమన్నారు. కొందరు సమీప బంధువులు, పలువురు సన్నిహితులను మాత్రమే ఈవెంట్ కు పిలుస్తామన్నారు. ఇప్పటికి ఇంకా ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని పేర్కొన్నారు. కాగా ఫర్హాన్‌, శిబానీలకు 2018లో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో అప్పటి నుంచి వారిద్దరూ రిలేషన్‌లో ఉ‍న్నారు. ఇదిలా ఉండగా ఫర్హాన్ అక్తర్ 2000 సంవ‌త్స‌రంలో అధునా బ‌బానీని పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు జ‌న్మించారు. ప‌ద‌హారేళ్లు క‌లసిమెలసి ఉన్న ఈ దంప‌తుల మ‌ధ్య విభేదాలు రావ‌డంతో 2016లో విడాకులు తీసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం:

ఇక్కడి మట్టే మసాలా!

ఈవెంట్ పర్మిట్ల పేరుతో భారీగా ఫీజుల వసూలు

పవన్ మూవీ షూట్ కంప్లీట్