ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీకి మేళతాళాలతో అర్చకుల స్వాగతం

ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీకి మేళతాళాలతో అర్చకుల స్వాగతం

ఫ్రాన్స్ టూర్ లో బిజీగా గడుపుతున్నారు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ. రాజధాని పారిస్ నగరంలోని UNESCO(యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ కు ఈ ఉదయం వెళ్లారు ప్రధాని.

పీఎం మోడీ రాకకోసం యునెస్కో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంస్కృతులను కాపాడేందుకు కృషి చేసే ఈ సంస్థ.. భారతీయ సంప్రదాయం ప్రకారం ప్రధానిని ఆహ్వానించింది. ప్రధానికి పూర్ణకుంభంతో, మేళ తాళాలతో స్వాగతం పలికారు. ఆఫీస్ వెలుపలే ప్రధానికి స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు.. ఆఫీస్ లోపలికి తోడ్కొని వెళ్లారు. ప్రధాని రాక సందర్భంగా.. భారతీయ కట్టుబొట్టుతో అక్కడి అధికారులు కనిపించారు. తనను చూసేందుకు, కలిసేందుకు వచ్చిన ప్రవాసులకు మోడీ నమస్కరిస్తూ కదిలారు.

తర్వాత యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలేతో భేటీ అయ్యారు. మర్యాదపూర్వక సమావేశం తర్వాత.. యునెస్కో ఆడిటోరియంలో ఫ్రాన్స్ లోని ప్రవాస భారతీయులు పాల్గొన్న భారీ సభలో ప్రసంగించారు మోడీ.