బంగ్లా ప్రధానికి స్వాగతం పలికిన ప్రధాని మోడీ

బంగ్లా ప్రధానికి స్వాగతం పలికిన ప్రధాని మోడీ

రాష్ట్రపతి భవన్ దగ్గర బంగ్లా ప్రధాని షేక్ హసీనాకు  ప్రధాని మోడీ స్వాగతం పలికారు. తర్వాత రాష్ట్రపతి భవన్ లో త్రివిధ దళాధిపతుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె భారత్ రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. బంగ్లాదేశ్ కు భారత్ అందించిన సహకారాన్ని ఎప్పటికీ గుర్తుంచుంకుంటామన్నారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరుపుతామన్నారు. వీటిపై బంగ్లాతో కలిసి భారత్ పనిచేస్తుందనుకుంటున్నా అని అన్నారు. భారత్, బంగ్లాలోనే కాకుండా దక్షిణాసియాలోని ప్రజలు మెరుగైన జీవన విధానాలు పొందగలరని షేక్ హసీనా అన్నారు . 


బంగ్లా ప్రధాని షేక్  హసీనా భారత్ లో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన కోసం నిన్న ఢిల్లీకి వచ్చారు. ప్రఖ్యాత నిజాముద్దీన్  ఔలియా దర్గాను షేక్ హసీనా దర్శించుకున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి  జైశంకర్  బంగ్లా ప్రధానితో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్య రంగాలతో పాటు నదీ జలాల పంపిణీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇవాళ చర్చించనున్నారు.