
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం(జూలై2) నుంచి ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. జులై 2 నుంచి జులై 9 వరకు ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ఆయన పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత జులై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటిస్తారని చెప్పారు. అనంతరం ట్రినిడాడ్ అండ్ టొబాగోలలో జులై 3, 4 తేదీల్లో పర్యటిస్తారు.
జులై 4న అర్జెంటీనాకు వెళ్లనున్న ప్రధాని మోదీ.. 5వ తేదీ వరకు అక్కడే ఉంటారు. జులై 5 నుంచి 8వ తేదీ వరకు బ్రెజిల్‌లోని రియో వేదికగా జరగనున్న 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. అనంతరం 9న నమీబియాకు వెళ్లి చర్చలు జరపనున్నారు. 8 రోజుల టూర్లో 5 దేశాలను మోదీ కవర్ చేయనున్నారు. కాగా, గత పదేండ్లలో మోదీ అత్యంత సుదీర్ఘమైన దౌత్య పర్యటనల్లో ఇదీ ఒకటిగా నిలవనుంది.