మల్టీటాలెంటెడ్‌ సితారకు పదేళ్లు

మల్టీటాలెంటెడ్‌ సితారకు పదేళ్లు

సోషల్ మీడియాలో క్యూట్ పిక్స్, వీడియోస్ తో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకుంది సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార. యాక్టింగ్, సింగింగ్, పెయింటింగ్, డ్యాన్సింగ్ తో ఇప్పటికే తన టాలెంట్ ను నిరూపించుకుంది. చిన్న వయసులోనే మల్టీటాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్న సితార.. తాజాగా ఆమె తన 10వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సితార తండ్రి మహేశ్.. సోషల్ మీడియా ద్వారా కూతురికి బర్త్ డే విషెస్ తెలిపారు. 

'తెలియకుండానే అప్పుడే పదేళ్లు గడిచిపోయాయి. నా ప్రపంచంలో ప్రకాశవంతమైన నక్షత్రంగా భావించే సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!! నేను నిన్ను పదిరెట్లు ప్రేమిస్తున్నాను..' అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా.. సితారకు అందరూ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక తన తండ్రి మహేశ్ సినిమా 'సర్కారు వారి పాట'లోనూ పెన్నీ సాంగ్‌లో సితార వేసిన స్టెప్స్ అందిరినీ మైస్మరైజ్ చేశాయి.