జూబ్లీహిల్స్, వెలుగు: ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్ర కుమార్ తెలిపారు. పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, కెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయన్నారు.
55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎస్‌ఈటీ, ఎన్‌ఈటీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులైనవారు పోస్టులకు అర్హులని, సెప్టెంబర్ 4న జరిగే రాత పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
