- ప్రిన్సిపల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దీప
హుజూర్ నగర్,వెలుగు:కోర్టు పరిధిలోని పెండింగ్ కేసుల పరిష్కారానికి అందరూ సహకరించాలని ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కాసరగడ్డ దీప అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ మాట్లాడుతూ కోర్టు పరిధిలో ఐదు వేల పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నారపరాజు శ్రీనివాసరావు,రమణారెడ్డి కమిటీ సభ్యులు స్వాగతం పలికి అభినందించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు పాల్గొన్నారు.
