బాబోయ్.. పృథ్వీ షా గర్ల్‌ఫ్రెండ్ ఇంత పొడవుందేంటి?

బాబోయ్.. పృథ్వీ షా గర్ల్‌ఫ్రెండ్ ఇంత పొడవుందేంటి?

భారత యువ క్రికెటర్ పృథ్వీ షా తన ప్రేయసి నిధి తపాడియాతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ముంబై వేదికగా జరుగుతున్న ఐఐఎప్ఏ–2023 అవార్డుల ప్రధానోత్సవంలో షా.. నిధితో కలిసి సందడి చేశాడు. టాప్ టు బాటమ్ బ్లాక్  కలర్ దుస్తులలో షా కనిపించగా.. నిధి కూడా బ్లాక్ కలర్ సారీ, స్లీవ్ లెస్ జాకెట్‌తో దర్శనమిచ్చింది. వీరిద్దరూ చాలాకాలంగా రిలేషన్‌లో ఉన్నా.. పబ్లిక్‌గా ఎప్పుడూ కలిసి కనిపంచలేదు. అలాంటిది మొదటిసారి ఆమెతో కలసి పబ్లిక్‌గా దర్శనమివ్వడంతో కెమెరాలన్నీ వారిపైనే ఫోకస్ పెట్టాయి. 

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిథ్యం వహించిన పృథ్వీ షా పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్నాడు. మొత్తం 8 మ్యాచులు ఆడిన షా.. కేవలం 106 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఇక 14 మ్యాచుల్లో నాలుగింట విజయం సాధించిన ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. దీంతో ఇంటి బాట పట్టిన షా.. ఆనాటి నుంచి వ్యక్తిగత జీవితంలో మునిగి తేలుతున్నాడు. ప్రేయసితో  ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు.

https://twitter.com/IPLnCricket/status/1662385690787606528