హార్దిక్‌, పృథ్వీకి షాక్‌

హార్దిక్‌, పృథ్వీకి షాక్‌
  • భువనేశ్వర్‌‌కు మొండిచేయి.. కుల్దీప్‌‌, సైనీపై వేటు
  • విహారి, జడేజా, షమీ రీఎంట్రీ.. స్టాండ్‌‌ బై లిస్ట్‌‌లో ప్రసిధ్‌‌, అవేశ్‌‌
  • ఇంగ్లండ్‌‌ టూర్‌‌కు 20 మందితో టీమ్‌‌ ఎంపిక

న్యూఢిల్లీ: స్టార్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా, యంగ్​ ఓపెనర్​ పృథ్వీషాకు సెలెక్టర్లు షాకిచ్చారు. ఇంకా పూర్తి స్థాయిలో బౌలింగ్​ చేయలేకపోతున్న పాండ్యా ఇండియా టెస్టు టీమ్‌‌లోకి తిరిగి రాలేకపోయాడు. అలాగే, డొమెస్టిక్​  క్రికెట్​, ఐపీఎల్​లో దంచికొట్టి మళ్లీ ఫామ్​ అందుకున్న పృథ్వీపై సెలెక్టర్లు జాలి చూపలేదు. అయితే, గాయాల నుంచి కోలుకొని ఫిట్‌‌నెస్‌‌ సాధించిన హైదరాబాదీ హనుమ విహారి, స్పిన్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ రవీంద్ర జడేజా రీఎంట్రీ ఇచ్చారు. దాదాపు నాలుగు నెలల పాటు సాగే  ఇంగ్లండ్‌‌ టూర్‌‌కు వెళ్తున్న 20 మందితో కూడిన టెస్ట్​ టీమ్‌‌లో విహారి, జడేజా ప్లేస్‌‌ దక్కించుకున్నారు. వచ్చే నెలలో జరిగే వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్​తో పాటు ఇంగ్లండ్‌‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌ కోసం సెలెక్టర్లు శుక్రవారం ఈ టీమ్‌‌ను ఎంపిక చేశారు. విరాట్‌‌ కోహ్లీ సారథ్యంలోని టీమ్‌‌లో ప్రధాన ఆటగాళ్లు, టెస్టు స్పెషలిస్టులతో పాటు ఆసీస్‌‌ టూర్‌‌, ఇంగ్లండ్‌‌తో హోమ్‌‌ సిరీస్‌‌లో సత్తా చాటిన ప్లేయర్లంతా ప్లేస్‌‌ నిలబెట్టుకున్నారు. ఇక, జడేజా, విహారితో పాటు ఇంగ్లండ్‌‌తో టెస్టు సిరీస్‌‌కు దూరంగా ఉన్న సీనియర్‌‌ పేసర్‌‌ మహ్మద్‌‌ షమీ కూడా మళ్లీ నేషనల్‌‌ టీమ్‌‌లోకి వచ్చాడు. ఆసీస్‌‌ టూర్‌‌లో ఈ ముగ్గురూ గాయపడిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇంగ్లండ్‌‌తో జరిగిన హోమ్‌‌ సిరీస్‌‌లో హార్దిక్‌‌ టీమ్‌‌లోనే ఉన్నప్పటికీ బరిలోకి దిగలేదు. బౌలింగ్‌‌ చేసేంత ఫిట్‌‌నెస్‌‌ లేకపోవడంతో ఇంగ్లండ్‌‌ టూర్‌‌కు అతని పరిగణనలోకి తీసుకోలేదు. ‘హార్దిక్‌‌ ఇప్పటికీ బౌలింగ్‌‌ చేసే పొజిషన్‌‌లో లేడు. ఇంగ్లండ్‌‌తో హోమ్‌‌ సిరీస్‌‌లో టీమ్‌‌తో పాటు ఉంచి బౌలింగ్‌‌ వర్క్‌‌లోడ్‌‌తో  ప్రిపేర్‌‌ చేయడానికి సెలెక్టర్లు చేసిన ప్రయోగం పూర్తిగా ఫెయిలైంది. అందుకే టెస్ట్‌‌ క్రికెట్‌‌కు అతడిని పరిగణనలోకి తీసుకోలేదు’ అని బోర్డు వర్గాలు చెప్పాయి. ఇక, బ్యాటింగ్‌‌ స్టార్‌‌ పృథ్వీ షాకు మాత్రం సెలెక్టర్లు షాకిచ్చారు. 

ఫామ్‌‌ కోల్పోయిన కారణంగా ఆస్ట్రేలియా టూర్‌‌లో ఫస్ట్‌‌ టెస్ట్‌‌ తర్వాత టీమ్‌‌కు దూరమైన షా.. విజయ్‌‌ హజారే వన్డే ట్రోఫీలో తిరిగి టచ్‌‌లోకి వచ్చాడు. ఆ టోర్నీలో పరుగుల మోత మోగించిన అతను ఐపీఎల్‌‌లోనూ ఆకట్టుకున్నాడు. కానీ, షా.. వైట్‌‌ బాల్‌‌ ఫామ్‌‌ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. కాగా, ఈ టూర్‌‌లో భాగంగా తొలుత సౌతాంప్టన్‌‌లో జూన్‌‌ 18వ తేదీన మొదలయ్యే వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్లో న్యూజిలాండ్‌‌తో కోహ్లీసేన పోటీ పడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌‌ 14 వరకు జరిగే ఐదు టెస్టుల సిరీస్‌‌లో ఇంగ్లండ్‌‌తో తలపడుతుంది.  క్వారంటైన్‌‌ రూల్స్‌‌ నేపథ్యంలో  ఈ నెల మూడో వారంలోనే టీమిండియా.. యూకే బయల్దేరే చాన్స్‌‌ ఉంది.

లోకేశ్‌‌, సాహా ఫిట్‌‌నెస్‌‌ నిరూపించుకుంటేనే..
అపెండిసైటిస్‌‌కు సర్జరీ చేయించుకున్న లోకేశ్‌‌ రాహుల్‌‌, ఐపీఎల్‌‌లో కరోనా బారిన పడ్డ కీపర్‌‌ వృద్ధిమాన్‌‌ సాహాను కూడా టీమ్‌‌కు ఎంపిక చేశారు. కానీ, ఈ ఇద్దరూ తమ ఫిట్‌‌నెస్‌‌ నిరూపించుకోవాల్సి ఉంటుందని సెలెక్టర్లు స్పష్టం చేశారు. మరోవైపు ఫామ్‌‌ కోల్పోయిన  స్పిన్నర్‌‌ కుల్దీప్‌‌ యాదవ్‌‌తో పాటు పేసర్‌‌ నవదీప్‌‌ సైనీపై వేటు పడింది. ఇంగ్లండ్‌‌తో హోమ్‌‌ సిరీస్‌‌లో సత్తా చాటిన అక్షర్‌‌ పటేల్‌‌  ఊహించినట్టుగానే థర్డ్‌‌ స్పిన్నర్‌‌గా ప్లేస్‌‌ నిలబెట్టుకున్నాడు. ఫిట్‌‌నెస్‌‌ సమస్యల కారణంగా నిలకడగా రాణించలేకపోతున్న సీనియర్‌‌ పేసర్‌‌ భువనేశ్వర్‌‌ కుమార్‌‌ను కూడా సెలెక్టర్లు టీమ్‌‌లోకి తీసుకోలేదు. 

ఫుల్ ఫామ్‌‌‌‌లో ఉన్న ఓపెనర్‌‌‌‌ పృథ్వీ షా పట్టించుకోలేదు. ఐపీఎల్‌‌‌‌లో ఆకట్టుకోలేకపోయిన ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యాకు  అవకాశం ఇవ్వలేదు. డొమెస్టిక్‌‌‌‌తో పాటు ఐపీఎల్‌‌‌‌లో దంచికొట్టిన యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌ దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌కు పిలుపు రాలేదు.  కరోనా విజృంభిస్తున్న టైమ్‌‌‌‌లో జంబో టీమ్‌‌‌‌ ఊసే లేదు. ఇలా ఎలాంటి అనూహ్య నిర్ణయాలకు తావివ్వని ఆలిండియా సీనియర్‌‌‌‌ సెలక్షన్‌‌‌‌ కమిటీ.. ఇంగ్లండ్‌‌‌‌ టూర్‌‌‌‌కు టీమ్‌‌‌‌ను ఎంపిక చేసింది. రెగ్యులర్‌‌‌‌ ప్లేయర్లందరితో పాటు గాయం నుంచి కోలుకొని ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సాధించిన ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ రవీంద్ర జడేజా, మిడిలార్డర్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ హనుమ విహారి, పేసర్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ షమీని తిరిగి టీమ్‌‌‌‌లోకి తీసుకుంది. భువనేశ్వర్‌‌‌‌ కుమార్‌‌‌‌ను పట్టించుకోని సెలెక్టర్లు.. స్పిన్నర్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌, పేసర్‌‌‌‌ నవదీప్‌‌‌‌ సైనీపై వేటు వేశారు. అలాగే, నలుగురు యంగ్‌‌‌‌ ప్లేయర్లను స్టాండ్‌‌‌‌ బైగా ఎంపిక చేయగా.. ఐపీఎల్‌‌‌‌లో మెరిపించిన పేసర్లు ప్రసిధ్‌‌‌‌ కృష్ణ, అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌తో పాటు ఇండియాలో ఫస్ట్‌‌‌‌ క్లాస్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఆడుతున్న ఏకైక యాక్టివ్​ పార్సీ క్రికెటర్‌‌‌‌ అయిన అర్జాన్‌‌‌‌కు చోటు దక్కింది.