రాజేంద్రనగర్లో ప్రైవేట్ బస్సు బీభత్సం.. ఒకరు మృతి

రాజేంద్రనగర్లో ప్రైవేట్ బస్సు బీభత్సం.. ఒకరు మృతి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆరాంఘర్ చౌరస్తాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. ముందు వెళ్తున్న బైక్ ను  ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తి బస్సు టైర్ల కింద పడి స్పాట్ లోనే చనిపోయాడు.

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు   ఓవర్ స్పీడ్ తోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎవరనేదానిపై విచారిస్తున్నారు.