
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జులై 20న ఉదయం అద్దంకి నార్కెట్ పల్లి హైవే ఎల్లారెడ్డి గూడెం దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తో పాటు మరో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
కందికూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈఘటన జరిగింది. ఈ ఘటనలో బస్సు నుజ్జునుజ్జు అయ్యింది. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని కామినేని హాస్పిటల్ కి తరలించారు.
ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నార్కట్ పల్లి SI క్రాంతికుమార్ & పోలీస్ టీమ్ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.