ఓఆర్ఆర్పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 2 కి.మీ మేర ట్రాఫిక్ జామ్

ఓఆర్ఆర్పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 2 కి.మీ మేర ట్రాఫిక్ జామ్

రంగారెడ్డి జిల్లా నార్సింగి సమీపంలో ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ పై హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న బస్సు డ్రైవర్ మద్యంమత్తులో అతివేగంగా దూసుకొచ్చిన అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు చక్రాల కింద నలిగిన ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డు ప్రమాదంతో ఓఆర్ఆర్ పై దాదాపు 2 కిలోమీటర్ల మేరా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో 18 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్రేన్ సహాయంతో బస్సును తొలగించి.. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు.. హైదరాబాద్ నుండి ఔటర్ రింగు రోడ్డు మీదుగా ముంబాయి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.