నాని ప్రజెంట్స్లో 'కోర్ట్–స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' చిత్రం గ్రాండ్ లాంచ్

నాని  ప్రజెంట్స్లో 'కోర్ట్–స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'  చిత్రం గ్రాండ్ లాంచ్

హీరో నాని సొంత నిర్మాణ సంస్థ వాల్‌‌ పోస్టర్స్‌‌ సినిమాస్ బ్యానర్‌‌‌‌లో ప్రియదర్శి హీరోగా ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనుంది. రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు.  ప్రియదర్శిపై  చిత్రీకరించిన  ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్‌‌ కొట్టగా, నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచాన్‌‌ చేశారు.  

జెమినీ కిరణ్‌‌ ఫస్ట్‌‌ షాట్‌‌కి దర్శకత్వం వహించారు. అన్యాయంగా ఓ కేసులో ఇరికించిన ఓ కుర్రాడి కోసం జరిగే న్యాయ పోరాటమే ఈ చిత్ర కథ.  ప్రియదర్శి లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.  శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడితో పాటు కార్తికేయ శ్రీనివాస్, వంశీధర్ సిరిగిరి స్క్రీన్ ప్లే రాశారు. సెప్టెంబర్‌‌లో రెగ్యులర్‌‌ షూటింగ్‌‌ ప్రారంభం కానుంది.