సంజయ్‌‌‌‌ లీలా భన్సాలీ డైరెక్షన్‌‌‌‌లో ప్రియాంక చోప్రా మరో మూవీ

సంజయ్‌‌‌‌ లీలా భన్సాలీ డైరెక్షన్‌‌‌‌లో ప్రియాంక చోప్రా మరో మూవీ

ఒకప్పుడు హిందీలో స్టార్ హీరోయిన్‌‌‌‌గా సత్తా చాటిన ప్రియాంక చోప్రా.. గత కొన్నేళ్లుగా హాలీవుడ్‌‌‌‌ ప్రాజెక్ట్స్‌‌‌‌తో బిజీ అవడంతో బాలీవుడ్‌‌‌‌కు దూరమైంది. నిక్ జోనస్‌‌‌‌తో పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయిన ఆమె, లాంగ్ గ్యాప్‌‌‌‌ తర్వాత భర్త, కూతురు మాల్టీతో కలిసి ముంబై వచ్చింది. ఇక్కడ వరుస ఈవెంట్స్‌‌‌‌లో పాల్గొంటున్న ఆమె, మరోవైపు  తిరిగి హిందీలో సినిమాలు చేసేందుకు బాలీవుడ్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌ మేకర్స్‌‌‌‌తో చర్చలు జరుపుతోంది. 

తన సొంత బ్యానర్‌‌‌‌‌‌‌‌లో మూడు నుంచి నాలుగు సినిమాలు చేయాలని భావిస్తోందట. ఈ క్రమంలో సంజయ్‌‌‌‌ లీలా భన్సాలీ డైరెక్షన్‌‌‌‌లో ఆమె నటించబో తున్నట్టు తెలుస్తోంది. 2015లో భన్సాలీ తీసిన ‘బాజీరావు మస్తానీ’ సినిమాలో కాశీ బాయి పాత్రలో పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పెర్ఫా ర్మెన్స్ ఇచ్చింది ప్రియాంక. మళ్లీ ఇన్నేళ్లకు వీరి కాంబినేషన్‌‌‌‌లో సినిమా రాబోతోంది. పీరియాడిక్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఉండే ఓ యాక్షన్ డ్రామాను ఆమె కోసం రెడీ చేస్తున్నాడట భన్సాలీ. 

ఇప్పటికే స్టోరీ లైన్ నచ్చడంతో భన్సాలీకి తగ్గట్టుగా తన డేట్స్‌‌‌‌ సర్దుబాటు చేసే ప్రయత్నాల్లో ఉందట ప్రియాంక. నిజానికి ఫర్హాన్‌‌‌‌ అక్తర్ డైరెక్షన్‌‌‌‌లో కత్రినా, అలియాభట్‌‌‌‌తో కలిసి ‘జీ లే జరా’ అనే  రోడ్ ట్రిప్‌‌‌‌ మూవీతో ప్రియాంక రీఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఆరేళ్లుగా ఈ సినిమా ఆలస్యమవు తూనే ఉంది. దీంతో భన్సాలీ సినిమా తోనే ప్రియాంక రీఎంట్రీ ఇచ్చే చాన్సెస్‌‌‌‌ కనిపిస్తున్నాయి.