లాస్ ఏంజెల్స్‌లో గ్రాండ్‌గా జరిగిన ‘అకాడమీ మ్యూజియం గాలా’ వేడుకల్లో గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా జోనస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్లో టేలర్ స్విఫ్ట్, సబ్రినా కార్పెంటర్, కిమ్ కర్దాషియాన్, కెండల్ జెన్నర్, హేలీ బీబర్, డెమీ మూర్ వంటి హాలీవుడ్ ప్రముఖులతో కలిసి ఆమె సందడి చేసింది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ‘వివియన్ వెస్ట్‌వుడ్’ రూపొందించిన క్రీమ్ కలర్ గౌనులో ఆమె రాయల్ లుక్‌లో హుందాగా మెరిసింది.
మ్యూజియం ఎగ్జిబిషన్స్, పబ్లిక్ స్క్రీనింగ్స్, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్‌కు ఫండ్స్ రైజ్ చేసేందుకు రోలెక్స్ సమర్పణలో ఈ గాలాను నిర్వహించారు. హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్, కేట్ క్యాప్షా, రాబర్ట్ రోడ్రిగ్జ్ దీనికి సహ అధ్యక్షత వహించారు. ఈ వేదికపై చార్లిజ్ థెరాన్కు ‘ఐకాన్ అవార్డు’, జాన్ కార్పెంటర్‌కు ‘ల్యూమినరీ అవార్డు’, కోల్మన్ డొమింగోకు ‘వాంటేజ్ అవార్డు’ అందజేశారు. హాలీవుడ్ స్టార్స్ మధ్య ప్రియాంక తనదైన శైలితో నిలిచి, భారతీయ ప్రతిభను మరోసారి చాటింది.
