దేశంలో ప్రజాస్వామ్యం ఖతమైంది..ప్రియాంక గాంధీ ఫైర్

దేశంలో ప్రజాస్వామ్యం ఖతమైంది..ప్రియాంక గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖతమైంద ని, విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు.

నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపిన ఆమె, ప్రశాంతంగా ఆందోళన చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని గుర్తుచేశారు. సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ కట్ చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల పోరుకు  కాంగ్రెస్ చివరి వరకు అండగా ఉంటుందని చెప్పారు.