జనంపై ట్యాక్స్ పెంచడం..కార్పొరేట్లపై తగ్గించడం..ఇదీ మోదీ ఘనత: ప్రియాంక గాంధీ

జనంపై ట్యాక్స్ పెంచడం..కార్పొరేట్లపై తగ్గించడం..ఇదీ మోదీ ఘనత: ప్రియాంక గాంధీ

గడిచిన పదేళ్లలో మోదీ సర్కార్ బడా వ్యాపారులకోసం మాత్రమే పనిచేసిందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.పేదలు, బడుగు , బలహీన వర్గాలకోసం మోదీ ప్రభుత్వం ఏనాడు పనిచేయలేదన్నారు.  మోదీ తన మిత్రులకోసం రూ. 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారన్నారు. పేదలు మాత్రం రూ. 50 వేల లోన్ కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. వాస్తవాలు తెలియకుండా మీడియాను మేనేజ్ చేస్తున్నారని.. దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ది పొందాలని బీజేపీ చూస్తోందని ప్రియాంకగాంధీ అన్నారు. 

జనంపై ట్యాక్స్ పెంచేస్తున్నారు..కార్పొరేట్లపై తగ్గిస్తున్నారు.. ఇదే మోదీ ఘనత అన్నారు ప్రియాంకగాంధీ. మాపై బీజేపీ అబద్ధాలు చెప్పినా..మా సత్యమార్గం వదలమన్నారు..ఎన్ని కష్టాలున్నా సత్యమార్గమే మన హిందూధర్మం  అని ప్రియాంక గాంధీ అన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ప్రియాంకగాంధీ అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 500 లకే సిలిండర్ ఇస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్నారు..ఆ ప్రయత్నాలకు ఇక్కడినుంచి గండి కొట్టాలని ప్రియాంక గాంధీ కోరారు.